నటసింహా బాలయ్య నటించిన లయన్ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ షోగా నిలిచింది. నందమూరి అభిమాని సత్యదేవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య ఓ పవర్ ఫుల్ సీబీఐ అధికారిగా నటించారు. బాలయ్య ఆహార్యం అద్భుతంగా కుదిరినా కొన్ని చోట్ల కొన్ని సన్నివేశాల్లో ఉన్న ఫ్లానెస్ వల్ల ఈ సినిమా తిరస్కారానికి గురైందని క్రిటిక్స్ ఎనలైజ్ చేశారు. ఏదైతేనేం... ఈ చిత్రంలోని బాలయ్యబాబు క్యారెక్టరైజేషన్ నచ్చిందో ఏమో ఈ సినిమా రీమేక్ చేసేందుకు ఓ ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ దర్శకుడితో సంప్రదింపులు సాగించిందని తెలుస్తోంది. అన్నీకుదిరితే స్టార్ హీరో అజయ్ దేవగన్ ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఉందని లయన్ దర్శకుడు సత్యదేవ్ చెబుతున్నాడు.
నేడు సత్యదేవ్ జన్మదినం సందర్భంగా ముచ్చటిస్తూ... లయన్ చిత్రం నందమూరి అభిమానులకు బాగా నచ్చింది. లయన్ రీమేక్ విషయమై బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఆసక్తిగా ఉంది. అజయ్ తో తీసే ఛాన్సుంది... అంటూ రివీల్ చేశాడు. అంతే కాదు లయన్ ఫ్లాప్ హిట్ తో సంబంధం లేకుండా బాలయ్యపై అభిమానంతో సార్వభౌమ అనే ఓ ఆసక్తికర కాన్సెప్టును రెడీ చేశానని చెబుతున్నాడు. బాలయ్య ఎప్పుడు ఓకే చెబితే అప్పుడు సెట్స్ కెళ్లడమేనని అంటున్నాడు. ఈలోగానే ఓ యువ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నానని వెల్లడించాడు.
ఒక అభిమానిగా న్యూ ఎటెంప్ట్ చేసేందుకు రెడీ అవుతున్న బర్త్ డే బోయ్ మొదటిసారి చేసిన తప్పుల్ని రిపీట్ చేయకుండా చూసుకుంటే సరి. సన్నివేశాల కూర్పులో ఎగ్జయిట్ మెంట్ తప్పు దారి పట్టించినా కాస్త కంట్రోల్ గా ఉంటే బాలయ్య లాంటి స్టార్ ని అయినా డౌన్ టు ఎర్త్ చూపించడం సాధ్యమే. అలా చూపించినప్పుడు ఆ మెచ్చూరిటీ లెవల్ కామన్ ఆడియెన్ కి కూడా కనెక్టవుతుంది. అప్పుడే హిట్టొస్తుంది. సత్యదేవ్ వింటున్నారా? ఆల్ ది బెస్ట్. బాలయ్య సార్వభౌమగా కనిపించాలని ఆశిద్దాం.

No comments:
Post a Comment