Friday, 18 September 2015

తాళి కట్టే సమయంలో కంగారుపడిన కలర్స్ స్వాతి


ఇప్పటి వరకు పక్కింటి అమ్మాయి పాత్రల్లో కనిపించిన తెలుగు అందం స్వాతి.. ఫస్ట్ టైమ్ భయపెట్టేందుకు రెడీ అవుతోంది. 'గీతాంజలి' మూవీ డైరెక్టర్ రాజ్ కిరణ్ తెరకెక్కిస్తున్న 'త్రిపుర'లో టైటిల్ రోల్ పోషిస్తోందీ అమ్మడు. రీసెంట్ గా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ లో హౌస్ వైఫ్ గా కన్పిస్తూనే.. లాస్ట్ లో హారర్ గెటప్ లోకి షిఫ్ట్ అయి ట్విస్ట్ ఇచ్చింది స్వాతి. ఇదిలా ఉంటే... ఈ టాలీవుడ్ హీరోయిన్ రీసెంట్ గా పెళ్లి పీటలు ఎక్కిందట. ఆ టైమ్ లో తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కూడా ఈ ముద్దుగుమ్మే పూసగుచ్చినట్లు వివరిస్తోంది. అదంతా తర్వాత సంగతి కానీ.. ముందు మన కలర్స్ స్వాతి.. కళ్యాణం ఎప్పుడు చేసుకుందని అనుమానం వస్తోందా.. జస్ట్ వెయిట్.. అక్కడికే వస్తున్నాం. అసలు విషయం ఏమిటంటే.. త్రిపుర మూవీ కోసం పెళ్లికూతురు అయిందట స్వాతి. అందుకోసమని హీరో నవీన్ చంద్రతో మూడు ముళ్లు వేయించుకుందట అమ్మడు. ఆ టైమ్ లో తను చాలా నెర్వస్ గా ఫీలయిందట. సినిమా కోసం అయినా అంతమంది మధ్య తాళి కట్టించుకోవడం కొంచెం బెరుకుగా అనిపించిదట. ఉత్తుత్తి పెళ్లికే ఇంత కంగారు పడితే.. ఇక నిజమైన పెళ్లి చేసుకోవాలంటే.. ఎంతో ధైర్యం ఉండాలని చెపుతోంది అమ్మడు. ఇప్పటి వరకు ఎన్నో సన్నివేశాల్లో నటించిన తనకు.. మొదటిసారి పెళ్లి సీన్ లో యాక్ట్ చేసిన అనుభవం కొత్తగా.. వింతగా ఉన్నట్లు చెపుతోంది. మరి సినిమాలో మ్యారేజ్ సీన్ కే ఇంత భయపడిపోతే.. రియల్ లైఫ్ లో స్వాతి ఇంకెంత టెన్ష్ అవుతుందో చూడాలంటే.. కొంతకాలం ఎదురుచూపులు తప్పవు. ఏమంటారు..?

No comments:

Post a Comment