పవర్ స్టార్ రంగంలోకి దూకేశాడు. సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ లో యమ బిజీగా ఉన్నాడు పవన్. ఈయనకు కాస్త తిక్క ఉన్నా.. దానికి లెక్క మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మొదలు పెట్టడం కాస్త లేట్ చేశాడేమో కానీ.. ఒక సారి స్టార్ట్ అయ్యాక రేసుగుర్రం కంటే స్పీడ్ గా వెళ్లిపోవడం పవన్ స్టైల్.
తన సీన్స్ కి పవన్ ఇస్తున్న స్పెషల్ ఫినిషింగ్ చూస్తుంటే.. యూనిట్ కి మతిపోతోందట. తన స్టైల్లో సీన్స్ కంప్లీట్ చేసేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అది కూడా శరవేగంగా. సర్దార్ ని సూపర్ స్పీడ్ గా ఫినిష్ చేయాలన్నది పవన్ ఆలోచన. ముఖ్యంగా తన మూవీ కోసం ఫ్యాన్స్ ని ఎక్కువ కాలం వెయిట్ చేయించకూడదని అనుకుంటున్నాడట పవన్.
ముందుగా అనుకున్న ప్రకారం సంక్రాంతికి ఎట్టి పరిస్థితిలోనూ గబ్బర్ సింగ్ రిలీజ్ చేయాలనే చూస్తున్నాడు పవన్. అలాగే గబ్బర్ సింగ్ లో ఎంత స్టైలిష్ గా పవన్ కనిపిస్తాడో.. అంతకు మించి చూపించబోతున్నాడు డైరెక్టర్ బాబీ. తొలిసారిగా పవన్ తో జత కట్టిన కాజల్ కూడా తెగ ఉత్సాహం చూపిస్తోందట. టీజర్ లోనే పవర్ చాటిన దేవిశ్రీ.. మరోసారి పవన్ కి అదిరిపోయే మ్యూజిక్ ఇవ్వబోతున్నాడు.
No comments:
Post a Comment