Sunday, 20 September 2015

పాత ఫ్రెండ్ తో ఎన్టీఆర్ కొత్త సినిమా

జూనియర్ ఎన్టీఆర్ - రాజీవ్ కనకాల మధ్య ఏం జరిగింది ? స్టూడెంట్ నెంబర్ వన్ నుంచి అశోక్  వరకూ ఎన్నో సినిమాల్లో కలిసి నటించిన వీరిద్దరూ.. తర్వాత ఎందుకు కలిసి కనిపించలేదు ? ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా పేరుపడ్డ వీరిద్దరూ.. స్క్రీన్ పై మాత్రం కలిసి కనిపించి చాలా కాలమే అయింది. వీరి మధ్యలో విబేధాలు తలెత్తాయని.. అందుకే ఇలా జరిగిందంటూ చాలా గాసిప్స్ వినిపించాయి.

ఇలాంటి వాటన్నిటికీ చెక్ పడబోతోంది. సుకుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ నాన్నకు ప్రేమతో. ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ రాజీవ్ చేస్తున్నాడు. ఈ కేరక్టర్ కు రాజీవ్ కరెక్ట్ అంటూ.. ఎన్టీఆర్ చెప్పి మరీ ఇప్పించాడట. అంటే తమ ఇద్దరి మధ్య విబేధాలేం లేవని యంగ్ టైగర్ చెప్పేసినట్లే.

విబేధాల వార్తలపై రాజీవ్ గతంలోనే స్పందించాడు. తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అనీ కొన్ని సినిమాలు ఫెయిల్ అవడంతో.. ప్రొఫెషనల్ గా దూరం పెరిగినా పర్సనల్ గా కలిసే ఉన్నామన్నాడు రాజీవ్. అంతే కాదు.. ఎవరినైనా ఇష్టపడితే వారితో అనుబంధాన్ని జీవితకాలం కొనసాగించే కేరక్టర్ ఎన్టీఆర్ దంటూ పొగిడాడు. ఫ్రెండ్ షిప్ అంటే అదే..  స్నేహితులంటే వీళ్లే.

No comments:

Post a Comment