Friday, 11 September 2015

వీడియో టాక్: రెజీనా గ్లామర్ అదరహో

పిల్లా నువ్వు లేని జీవితం చిత్రంతో సాయిధరమ్-రెజీన జోడీ హిట్ కొట్టింది. ఈ జంట చూడముచ్చటగానే కాదు యూత్ ఐకన్ లు అనిపించారు. సాయిధరమ్ కుర్రతనానికి పరాకాష్టలా కనిపించాడు ఆ చిత్రంలో. రెజీన ప్రేమవనంలో దేవకన్యలా మైమరిపించింది. లేటెస్టుగా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ చిత్రంతో ఈ ఇద్దరూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

ఇకపోతే ఇవాళే రిలీజైన యాష్ కరేంగే అనే పాట వెరీ స్పెషల్. సాయిధరమ్ స్టెప్పులతో పాటు రెజీనా థై షో కూడా ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.  ఆకాశం తస్సదియ్య అమ్మకానికెడితే ఆ రేటు ఎంత గానీ చెక్కు రాసి ఇద్దాం.. భూగోళం వేలం వేద్దామంటే .. హయ్యస్ట్ పాటపాడి డాలర్ ఇసిరేద్దాం..... పిచ్చిలో  పీక్స్ చూద్దాం. . రచ్చ రంభో్లా చేద్దాం... .యాస్ కరేంగా .. అంటూ సాగే ఈ పాట మాంచి మాస్ మసాలా బీట్ తో అదరగొట్టేసింది. ఈ పాటలో దరువు మాస్ లో ఊపు తెచ్చేదే. దానికి తగ్గట్టే విజువల్స్ చూస్తున్నంత సేపూ యంగ్ పెయిర్ స్టెప్పులు సూపర్భ్.

గ్లామర్ విషయంలో రెజీనా ఈ అమ్మడు పిక్కలపైకి చిట్టి పొట్టి డ్రెస్సులతో కనువిందు చేసింది. మోడరేట్ అయిన  జనరేషన్  గాళ్ లా కనిపించింది. దానికి తోడు ఇంతవరకూ తన కెరీర్ లో కనిపించనంత గ్లో ఈ అమ్మడిలో కనిపిస్తోంది. కుర్రతనం కొంటెతనం మిక్స్ చేసిన మోడ్రన్ బ్యూటీలా తనని తాను ట్యూన్ చేసుకుని స్టార్ హీరోలకు .. నేనున్నా.. చూస్కోండి అన్నట్టే కనిపించింది.

No comments:

Post a Comment