క్రికెటర్ శ్రీశాంత్ తెరంగేట్రం చేస్తున్న సినిమా పనులు ఊపందుకున్నాయి. ఈ మూవీకి సంబంధించి.. కేరక్టర్ ఆర్టిస్టుల ఎంపిక చేస్తున్నారు. మూవీకి కీలకమైన హీరో తల్లి పాత్రకు రమ్యకృష్ణని ఎంపిక చేసుకున్నారు యూనిట్. దక్షిణాదిలోని నాలుగు భాషల్లోనూ తెరకెక్కనున్న ఈ మూవీలో.. క్రికెట్ బేస్డ్ గానే స్టోరీ ఉంటుంది. హీరో తల్లి కేరక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుందిట ఈ సినిమాలో.
రమ్యకృష్ణ కేవలం సాంప్రదాయ తల్లిపాత్రమే కాకుండా... కొడుకుకు తొలి క్రికెట్ గురువు ఆమేనట. అందుకే.. ఈలీడ్ కేరక్టర్ కు రమ్యకృష్ణ లాంటి సీనియర్ ఎంచుకున్నారని తెలుస్తోంది. సౌతిండియాలో రమ్యకృష్ణకు మంచి పాపులారిటీయే ఉంది. బాహుబలి లో శివగామి పాత్ర కారణంగా.. ఈ క్రేజ్ గుర్తింపు పదింతలైందని చెప్పచ్చు. ఈ మూవీకి డైరెక్టర్ సానా యాదిరెడ్డి. తెలుగులో పిట్టలదొర - సంపంగి - బ్యాచ్ లర్స్ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శక నిర్మాత సానా యాదిరెడ్డి. తీసినది తక్కువ సినిమాలే అన్నీ సూపర్ హిట్స్ కావడం హైలైట్. అలాగే. సంపంగి చిత్రం హిందీలో కూడా రీమేక్ అయి మంచి హిట్ సాధించింది.
ఇప్పుడు శ్రీశాంత్ లాంటి సెలబ్రిటీని లాంఛ్ చేస్తూ.. అందులో రమ్యకృష్ణ లాంటి సీనియర్స్ కి చోటు కల్పించి.. దేశవ్యాప్తంగా గుర్తింపు లభించేలా ప్లాన్ చేసుకుంటున్నాడు సానా యాదిరెడ్డి. క్రికెటర్ శ్రీశాంత్ ని లాంఛ్ చేస్తూ... క్రికెట్ నే కాన్సెప్ట్ గా ఎంచుకుంటే.. అందులో ఫిక్సింగ్ లాంటి అంశాల కోసం కూడా జనాలు ఎదురుచూస్తారు. చూద్దాం.. ఈ కాంట్రవర్సియల్ కాన్సెప్ట్ ని ఈ డైరెక్టర్ ఎలా డీల్ చేస్తాడో ?

No comments:
Post a Comment