Saturday 19 September 2015

రెండు వారాలు.. 22 కోట్లు

రెండో వారం కూడా మగాడి జోరు కొనసాగింది. ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అటు యుఎస్ లో భారీ స్థాయిలో కలెక్షన్లు కొల్లగొట్టి భలే భలే అనిపించింది నాని సినిమా. రెండో వారం పూర్తయ్యేసరికి ‘భలే భలే మగాడివోయ్’ రూ.21.6 కోట్ల షేర్ రాబట్టడం విశేషం. గ్రాస్ వసూళ్లు రూ.37.2 కోట్లు వచ్చాయి. మూడో వారం అయ్యేసరికి షేర్ రూ.25 కోట్లు దాటడం ఖాయంగా కనిపిస్తోంది.

ఏరియాల వారీగా బ్రేకప్స్ చూస్తే.. తెలంగాణ (నైజాం)లో గ్రాస్ రూ.9.65 కోట్లు వచ్చింది. షేర్ రూ.5.85 కోట్లు. రాయలసీమ (సీడెడ్)లో రూ.2.4 కోట్ల గ్రాస్ - రూ.1.53 కోట్ల షేర్ కలెక్టయింది. ఆంధ్రాలో రూ.9.75 కోట్ల గ్రాస్.. రూ.5.82 కోట్ల షేర్ వసూలైంది. వైజాగ్ లో రూ.1.55 కోట్లు - తూర్పు గోదావరిలో రూ.91 లక్షలు - పశ్చిమ గోదావరిలో రూ.75 లక్షలు - కృష్ణాలో రూ.కోటి - గుంటూరులో రూ.1.28 కోట్లు - నెల్లూరులో రూ.33 లక్షల షేర్ వచ్చింది. ఏపీ తెలంగాణ కలిపి రూ.21.8 కోట్ల గ్రాస్ రాగా.. అందులో షేర్ రూ.13.2 కోట్లు.

కర్ణాటకలోనూ నాని సినిమా అదరగొట్టింది. అక్కడ గ్రాస్ రూ.5.23 కోట్లు కాగా.. షేర్ రూ.2.23 కోట్లు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన వసూళ్లు అమెరికాలో వచ్చాయి. ఇప్పటిదాకా అక్కడ ‘భలే భలే మగాడివోయ్’ రూ.8.42 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. షేర్ రూ.5.47 కోట్లు. మిగతా ఏరియాల్లో రూ.70 లక్షల షేర్ వచ్చింది. మొత్తంగా రెండు వారాల్లో ఈ సినిమా రూ.21.6 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ రేంజిని అందుకుంది. చివరికి ఈ సినిమా బడ్జెట్ చూస్తే రూ.6 కోట్లే కావడం విశేషం.

No comments:

Post a Comment