Wednesday 16 September 2015

సర్దార్ స్టిల్ ఇన్ పాజ్ మోడ్?


సర్దార్ కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సంపత్ నంది వెళ్లిపోయి బాబీ వచ్చాడు. కాజల్ సెట్టయ్యేలోపు.. ఓ పది మంది పేర్లు వినిపించాయి. అనీషా ఆంబ్రోస్ వెళ్లిపోయాక ఈ అమ్మడు వచ్చి చేరింది స్క్రిప్ట్ ఫైనలైజ్ కోసమయితే.. ఏడాదిపైగా టైమ్ తీసుకున్నారు. ఇన్ని జరిగాక సెట్స్ మీదకు వెళ్లారు కాబట్టి.. సర్దార్ కి కష్టాలు తీరిపోయినట్లే అనుకున్నారంతా. కానీ డైరెక్టర్ బాబీకి మాత్రం పెరుగుతున్నాయి సమస్యలు. 

ఓ వారం క్రితం షూటింగ్ స్పాట్ నుంచే అర్ధాంతరంగా సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ వెళ్లిపోయాడు. కొత్త సినిమాటోగ్రాఫర్ గా ఆర్థర్ విల్సన్ ని తీసుకుంటున్నామంటూ.. తెల్లారగానే ప్రకటించాడు బాబి. కానీ దీనికి పవన్ స్టాంప్ పడలేదట. దీంతో ఇది అఫీషియల్ న్యూస్ అవలేదు. అయినా.. ఇలా మార్చేసేలా డైరెక్టర్ ఒకడే నిర్ణయం తీసుకునే ప్రాజెక్ట్ కాదు ఇది.  పవర్ స్టార్ ఆమోద ముద్ర పడ్డాకే.. కొత్త కేరక్టర్ ఎంట్రీ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది.

మరి షూటింగ్ ఆగిపోయి వారం దాటింది. పవన్ నోరు మెదపడు. ప్రొడ్యూసర్ శరత్ మరార్ సహా.. ఎవరికీ పవన్ ని ఒత్తిడి చేసే ధైర్యం లేదు. పవర్ స్టార్ నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూడక తప్పని పరిస్థితి అందరిదీ. పవన్ సారూ.. కాస్త కనికరించి ఫైనల్ చేసేయండి.. బాబీకి బ్రెయిన్ వాచిపోతోందంట టెన్షన్ తో. 

No comments:

Post a Comment