Wednesday, 16 September 2015

ఫోటో స్టోరి: ఆ గులాబీలకు ముళ్లుంటే?


మూడు పదులు దాటినా అదే స్పార్క్ మెయింటెయిన్ చేస్తోంది క్యూట్ త్రిష. ఆ ఫేస్ లో ఆ ఎక్స్ ప్రెషన్ లో అదిరిపోయే అప్పీల్ ఉంది. ఆ బ్లౌజ్ పై గులాబీలతో ఎంబ్రాయిడరీ వర్క్ మైండ్ బ్లోవింగ్. అసలు ఇటీవలి కాలంలో ఇలాంటి డిజైన్ లో వేరొక హీరోయిన్ కనిపించిందే లేదు. త్రిష ఆలోచనలే వేరు. ఆ మైండ్ సెట్ ని రివీల్ చేసే రూపం ఇదేనని అనుకోవాలి.  లైట్ కలర్ శారీకి గులాబీల బ్లౌజ్ భలేగా సెట్ అయ్యింది. ఆ మ్యాచింగ్ ఆ సెలక్షన్ అదుర్స్. టీనేజీ అమ్మాయిలకు నడివయసు మగువలకు త్రిష బోలెడంత ఇన్ స్పిరేషన్ ఇప్పుడు. 

తన జీవితంలో అత్యంత కీలకమైన సందర్భంలో మొక్కవోని ధీక్షతో త్రిష స్పందించిన తీరు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసింది. వరుణ్ మణియన్ తో నిశ్చితార్థం క్యాన్సిల్ అయితే .. ఇక జీవితం ముగిసినట్టేనా? అని తన కాన్ఫిడెన్స్ తో చెప్పకనే చెప్పింది. సిసలైన ప్రపంచం లోకి ఇప్పుడే అడుగుపెడుతున్నా... అంటూ వరుసగా స్టార్ హీరోల సినిమాలకు కమిటై స్టార్ హీరోయిన్ స్టాటస్ ని మరోసారి చూపించింది. ఇప్పటికిప్పుడు తమిళ్ కన్నడ పరిశ్రమలపైనా దృష్టి సారించింది. తెలుగులోనూ ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.

ఆల్ మోస్ట్ కెరీర్ అయిపోయింది అన్న విమర్శలు ఎదురయ్యాక త్రిష కంబ్యాక్ అయిన తీరు ఇన్ స్పిరేషన్. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ డ్రెస్ సెన్స్ చూశాక  త్రిషలో డేర్ యాటిట్యూడ్ ని ప్రెజెంట్ చేసిన స్టయిల్ ఇదని పొగడాల్సిందే. మనసే ఒక బృందావనం .. మాటే ఒక మధువనం .. అంటూ పాటేసుకోవాల్సిందే. త్రిష ప్రస్తుతం కమల్ హాసన్ సరసన చీకటి రాజ్యం  చిత్రంలో నటించింది. ఇది కెరీర్ 50 వ సినిమా. టీజర్ ఎయిర్ లోకి వచ్చింది. త్రిష మూడే మూడు బిట్స్ లో అదరగొట్టేసింది.

No comments:

Post a Comment